బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

మెట్రో విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

మెట్రో విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

మే 20, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ నగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మెట్రో రెండో దశ విస్తరణకు కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ సమర్పించిన వెంటనే తదుపరి చర్యలు చేపడతామని వెల్లడించారు.కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో జరిగిన సమావేశంలో హైదరాబాద్‌కు సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై చర్చించినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. ముఖ్యంగా మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, మురుగునీటి శుద్ధి వ్యవస్థ అభివృద్ధిపై కేంద్రం సానుకూలంగా స్పందించిందన్నారు.మూసీ నది కాలుష్య నియంత్రణ కోసం రూ.3,975 కోట్ల వ్యయంతో 39 ఎస్‌టీపీలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. వీటి ద్వారా రోజుకు 972 ఎంఎల్డీ మురుగునీటిని శుద్ధి చేసే సామర్థ్యం ఏర్పడుతుందని చెప్పారు. దీంతో మూసీ నది పునరుజ్జీవనానికి దోహదం అవుతుందని అభిప్రాయపడ్డారు.అలాగే హైదరాబాద్ మెట్రో రెండో దశలో 162 కిలోమీటర్ల విస్తరణ ప్రతిపాదనలపై కూడా కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిపారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా వ్యయభారం పంచుకునే విధానంపై చర్చలు జరిగాయని పేర్కొన్నారు.మెట్రో విస్తరణతో నగర ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు ఐటీ కారిడార్, పాతనగరం, శివారు ప్రాంతాల మధ్య రవాణా మరింత సులభమవుతుందని అధికారులు భావిస్తున్నారు.హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి