బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

కేసీఆర్ కుటుంబ పాలనకు ప్రజలే ముగింపు పలికారు: బండి సంజయ్

కేసీఆర్ కుటుంబ పాలనకు ప్రజలే ముగింపు పలికారు: బండి సంజయ్

మే 20, (నేటి తెలుగు పత్రిక): బీజేపీ కార్యకర్తలు సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తారని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్టీ కార్యకర్తల క్రమశిక్షణ, కమిట్‌మెంట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.బీజేపీలో పనిచేసే ప్రతి కార్యకర్త శిక్షణతో పాటు అంకితభావంతో ముందుకు సాగుతారని పేర్కొన్నారు. చనిపోయిన తర్వాత కూడా తమపై బీజేపీ జెండా కప్పాలని కోరుకునే కార్యకర్తలు పార్టీకి ఉన్నారని వ్యాఖ్యానించారు.తాను కూడా కమిట్‌మెంట్ ఉన్న కార్యకర్తనని చెప్పిన బండి సంజయ్.. తన కుమారుడిని సైతం విచారణకు సహకరించాలంటూ స్వయంగా పోలీసులకు అప్పగించానని తెలిపారు. చట్టం ముందు అందరూ సమానమే అన్న నమ్మకంతోనే వ్యవహరించానన్నారు.తెలంగాణలో కొత్త పార్టీ వస్తుందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ కార్యకర్తలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా సిద్ధాంతాల కోసం పనిచేస్తారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌పై కూడా బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ఫామ్‌హౌస్ రాజకీయాలతో ప్రజలను మభ్యపెట్టలేరని, తెలంగాణ ప్రజలు కుటుంబ పాలనను తిరస్కరించారని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ అవినీతి, కుటుంబ రాజకీయాలకు ముగింపు పలికిందీ ప్రజలేనని వ్యాఖ్యానించారు.తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు బీజేపీ నిరంతరం పోరాడుతోందని బండి సంజయ్ స్పష్టం చేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి