Breaking News

కుత్బుల్లాపూర్‌లో టీఆర్ఎస్‌లో భారీ చేరికలు.. ప్రభుత్వానికి కవిత అల్టిమేటం

మే 21, (నేటి తెలుగు పత్రిక): కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ పలు కీలక అంశాలపై ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వచ్చే నెలలోపు ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని, జూన్ 2 నాటికి తెలంగాణ ఉద్యమకారులు మరియు అమరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రభుత్వంపై ఉద్యమం తప్పదన్నారు.కుత్బుల్లాపూర్‌లో 20 ఏళ్లుగా నిర్మాణంలో ఉన్న తెలంగాణ అమరుల స్థూపాన్ని జూన్ 2లోగా ఆవిష్కరించాలని, లేకపోతే టీఆర్ఎస్ ఆధ్వర్యంలో తామే ఆవిష్కరిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం తెలంగాణ రక్షణ సేన ఏర్పాటైందని పేర్కొన్నారు.పార్టీ జెండాలోని రంగులకు ప్రత్యేక అర్థాలున్నాయని వివరిస్తూ పసుపు రంగు సౌభాగ్యానికి, నీలి రంగు బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు కూలీల ప్రతీకగా, పచ్చ రంగు మైనార్టీలు మరియు పర్యావరణానికి సూచికగా పేర్కొన్నారు. జూన్‌లో స్కూల్స్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణ కోసం చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.రైతుల సమస్యలపై కూడా స్పందించిన కవిత, కొనుగోలు కేంద్రాల లోపం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. యువతకు 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు రుణాలు, ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించేలా తమ పార్టీ పనిచేస్తుందని తెలిపారు. సామాజిక న్యాయ తెలంగాణ సాధన కోసం టీఆర్ఎస్ కట్టుబడి ఉందన్నారు.

కార్మికులకు భారీ ఊరట.. జూన్ 1 నుంచి పెరగనున్న కనీస వేతనాలు

ఏఐ ప్రభావం.. బ్లూ కాలర్ ఉద్యోగాల వైపు యువత అడుగులు వేయాలి: సీఎం రేవంత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *