Breaking News

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ భారీ డేటా సెంటర్.. వేగంగా పనులు

మే 22, (నేటి తెలుగు పత్రిక): మైక్రోసాఫ్ట్ తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేస్తోంది. ఈ భారీ ప్రాజెక్టు మరికొన్ని నెలల్లో అందుబాటులోకి రానుందని మైక్రోసాఫ్ట్ ఇండియా, దక్షిణాసియా అధ్యక్షుడు పునీత్ చందోక్ వెల్లడించారు.దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌ను కీలక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా అజూర్ క్లౌడ్ సేవలు, కోపైలెట్ 365 ఏఐ టూల్స్‌కు విపరీతమైన ఆదరణ లభిస్తోందన్నారు.భారత్‌లో ఇంటర్నెట్ వినియోగం, సాంకేతిక నైపుణ్యాలు కలిగిన యువత సంఖ్య పెరగడం వల్లే భారీ పెట్టుబడులకు మైక్రోసాఫ్ట్ ముందుకొచ్చిందని పేర్కొన్నారు. గత ఏడాది ప్రకటించిన రూ.1.45 లక్షల కోట్ల పెట్టుబడి ప్రణాళికలో ప్రధాన భాగం హైదరాబాద్ డేటా సెంటర్ల అభివృద్ధికే కేటాయించినట్లు సమాచారం.ఇప్పటికే పుణె, చెన్నై, ముంబయిలలో డేటా సెంటర్లు ఉన్నప్పటికీ, హైదరాబాద్ కేంద్రం వాటన్నింటికంటే పెద్దదిగా రూపుదిద్దుకుంటోంది. డిజిటల్ డేటా రక్షణ చట్టాల అమలులో భాగంగా భారతీయ వినియోగదారుల సమాచారాన్ని దేశీయ సర్వర్లలో భద్రపరచేందుకు ఈ కేంద్రం కీలకంగా మారనుంది.క్లౌడ్ సేవల రంగంలో Google, Amazon వంటి సంస్థలతో పోటీ ఉన్నప్పటికీ, మౌలిక వసతుల పరంగా మైక్రోసాఫ్ట్ ముందంజలో ఉందని పునీత్ చందోక్ తెలిపారు.ప్రస్తుతం భారత్‌లో మైక్రోసాఫ్ట్ సంస్థలో 22 వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తుండగా, ఏఐ రంగంలో నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల కోసం డిమాండ్ భారీగా పెరిగిందన్నారు. భారత్‌లో రాబోయే ఏఐ విప్లవంలో మైక్రోసాఫ్ట్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎబోలా అలర్ట్.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కట్టుదిట్టమైన తనిఖీలు

భానుడి భగభగలు.. తెలంగాణలో వడదెబ్బతో 22 మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *