Breaking News

నేపాలీ నిందితుల కోసం ప్రత్యేక సిట్ ఏర్పాటు

మే 22, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ నగర పోలీసులు పరారీలో ఉన్న నేపాలీ నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. జూబ్లీహిల్స్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసుతో పాటు జవహర్‌నగర్, కాచిగూడ ప్రాంతాల్లో నమోదైన కేసుల్లో నిందితుల కోసం ఈ చర్యలు చేపట్టారు.సిటీ పోలీస్ కమిషనర్ C. V. Anand ఉత్తర్వులతో ఏర్పాటైన ఈ సిట్‌లో మొత్తం 20 మంది అధికారులు, సిబ్బంది పనిచేయనున్నారు. ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ముగ్గురు ఎస్‌ఐలు, 17 మంది కానిస్టేబుళ్లు ఈ బృందంలో భాగమవుతారు.ఐసీసీసీ ఐటీ సెల్‌ నుంచి ఈ ప్రత్యేక బృందం పనిచేస్తూ, నిందితుల కదలికలు, నెట్‌వర్క్, ఇతర అనుమానితుల వివరాలను సేకరించనుంది. హైదరాబాద్‌లో నమోదైన పలు కేసుల్లో నేపాలీ గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించినట్లు సమాచారం.ముఖ్యంగా జూబ్లీహిల్స్ హత్య కేసులో కీలక నిందితులు ఇంకా పరారీలో ఉండటంతో, వారిని త్వరగా అరెస్ట్ చేయడమే సిట్ ప్రధాన లక్ష్యంగా పోలీసులు వెల్లడించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *