Breaking News

సచివాలయం ముందు ఉద్రిక్తత.. కవిత అరెస్ట్

మే 22, (నేటి తెలుగు పత్రిక): కవిత రైతుల సమస్యలపై సచివాలయం ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. వడ్ల కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నిరసిస్తూ తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో కవిత పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళన చేపట్టారు.సచివాలయం ముందు వడ్ల కుప్ప పోసి ధర్నాకు దిగిన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ధాన్యానికి తరుగు తీయకుండా వెంటనే కొనుగోలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కార్యకర్తలు ప్లకార్డులతో నినాదాలు చేశారు.రైతులు కల్లాల్లో రోజుల తరబడి వేచి చూస్తున్నారని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే స్పందించాలని కవిత పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసన నేపథ్యంలో సచివాలయం పరిసరాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *