మే 22, (నేటి తెలుగు పత్రిక): మహారాష్ట్ర లోని చంద్రపూర్ జిల్లాలో పులి దాడి తీవ్ర కలకలం రేపింది. సిందేవాహి తాలూకా అటవీ ప్రాంతంలో తునికాకు (బీడి ఆకు) సేకరణకు వెళ్లిన మహిళలపై పులి దాడి చేసింది.ఈ ఘటనలో నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ ప్రాంతంలో పులుల సంచారం ఎక్కువగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఉదయం 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఘటనపై అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టి, గ్రామస్తులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
