Breaking News

శంషాబాద్ విమానాశ్రయంలో గంజాయి పట్టివేత.. ప్రయాణికుడు అరెస్ట్

మే 22, (నేటి తెలుగు పత్రిక): రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లో మరోసారి గంజాయి అక్రమ రవాణా యత్నాన్ని అధికారులు భగ్నం చేశారు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడి లగేజీలో సుమారు 10 కిలోల గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.లగేజీ బ్యాగ్ దిగువ భాగంలో ప్రత్యేకంగా తయారు చేసిన రహస్య ప్యాకెట్లలో గంజాయిని దాచిపెట్టి తరలించేందుకు ప్రయత్నించినట్లు అధికారులు వెల్లడించారు. స్కానింగ్ సమయంలో అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీలు చేపట్టగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.నిందితుడిని అదుపులోకి తీసుకుని అధికారులు విచారణ చేపట్టారు. మాదకద్రవ్యాల నియంత్రణ చట్టం కింద కేసు నమోదు చేసి, ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

గ్రామీణ తెలంగాణ అభివృద్ధికి బ్యాంకుల చురుకైన సహకారం అవసరం: మంత్రి తుమ్మల

ఎబోలా అలర్ట్.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కట్టుదిట్టమైన తనిఖీలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *