Breaking News

ఎబోలా అలర్ట్.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కట్టుదిట్టమైన తనిఖీలు

మే 22, (నేటి తెలుగు పత్రిక): ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసి విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా కాంగో, దక్షిణ సుడాన్, ఉగాండా దేశాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు అధికారులు తెలిపారు.ఇప్పటివరకు హైదరాబాద్‌లో ఎలాంటి ఎబోలా కేసులు నమోదు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే వెంటనే రిఫరల్ ఆస్పత్రులకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు చేసినట్లు ఎయిర్‌పోర్ట్ హెల్త్ అధికారులు వెల్లడించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *