Breaking News

ధాన్యం కొనుగోళ్లలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు: నిరంజన్ రెడ్డి

మే 24, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన వరి ధాన్యం 50 రోజులు గడిచినా కొనుగోలు జరగక రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు.వనపర్తి మార్కెట్ యార్డులో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన అనంతరం నిరంజన్ రెడ్డి రైతులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వానికి స్పష్టమైన ప్రణాళిక లేదని విమర్శించారు. సరైన రవాణా సదుపాయాలు లేని వారికి టెండర్లు ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు.బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసిన మూడు నాలుగు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేవని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కాకపోవడంతో పాటు మిల్లులకు తరలింపులో కూడా తీవ్ర జాప్యం జరుగుతోందని అన్నారు.రవాణా టెండర్లలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, ఈ వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. భారీ బకాయిలు ఉన్న మిల్లర్లకే మళ్లీ కాంట్రాక్టులు కేటాయిస్తున్నారని విమర్శించారు.కొన్ని అధికార పార్టీకి చెందిన మిల్లులకే ధాన్యం కేటాయింపులు జరుగుతున్నాయని ఆరోపించిన నిరంజన్ రెడ్డి, అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత లేకపోతే రైతుల పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని హెచ్చరించారు.అలాగే శ్రీధర్ రెడ్డి హత్య కేసులో ఇప్పటికీ నిందితులను అరెస్టు చేయలేదని ఆయన మండిపడ్డారు. కేసు పరిష్కారం కాకపోతే బాధిత కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి నివాసం ఎదుట నిరసన చేపడతామని హెచ్చరించారు.

మేడ్చల్‌లో టెర్రరిస్టులతో టచ్‌లో ఉన్న వ్యక్తి అరెస్ట్

ముందు ప్రజెంట్ సిటీని పట్టించుకో రేవంత్: కేటీఆర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *