బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

హైకోర్టు న్యాయవాది హత్య కేసులో సంచలన అంశాలు

హైకోర్టు న్యాయవాది హత్య కేసులో సంచలన అంశాలు

మే 25, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రూ.10 లక్షల సుపారీతో ఐదుగురు సభ్యుల ముఠా ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. కిషన్‌ అనే వ్యక్తి ద్వారా వినయ్‌ గ్యాంగ్‌తో ఒప్పందం కుదిరినట్లు దర్యాప్తులో తేలింది.ప్రధాన నిందితుడు వినయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో నలుగురు నిందితులు గోవా, కల్వకుర్తి ప్రాంతాలకు పారిపోయినట్లు సమాచారం. అయితే వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.హత్యకు ఉపయోగించిన సెకండ్‌హ్యాండ్ కారును ఆరు నెలల ముందే కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ కదలికలపై నిందితులు పలుమార్లు రెక్కీ నిర్వహించినట్లు తేలింది. ఇంటి వద్ద కారుతో ఢీకొట్టి సుమారు 20 మీటర్ల వరకు లాక్కెళ్లిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో నమోదయ్యాయి.వక్ఫ్ భూముల వివాదమే హత్యకు ప్రధాన కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. “మా నాన్నకు ముందే బెదిరింపులు వచ్చాయి” అని మృతుడి కుమారుడు ఫర్హాన్ ఆరోపించారు.ఈ కేసులో ముజాహిద్ ఆలంఖాన్, మహబూబ్ ఆలంఖాన్‌ల పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి