మే 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకురానున్న ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకానికి సంబంధించిన విధివిధానాలు దాదాపు ఖరారైనట్లు సమాచారం. రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.కుటుంబంలో మరణం సంభవించిన పక్షంలో నామినీ ఖాతాలో 10 రోజుల్లోనే బీమా నగదు జమయ్యేలా వ్యవస్థ రూపొందిస్తున్నట్లు సమాచారం. పథకం అమలులో పారదర్శకత కోసం వచ్చే నెల నుంచి ప్రభుత్వ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి కుటుంబ వివరాలను నమోదు చేయనున్నారు.జూన్ 2న ఈ పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు, అర్హతలు, అమలు విధానాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇందిరమ్మ బీమా పథకం.. 10 రోజుల్లోనే బీమా నగదు జమకు సర్కార్ ప్లాన్
