బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

డ్వాక్రా మహిళలకు శుభవార్త.. షూరిటీ లేకుండానే రూ.10 లక్షల రుణం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

డ్వాక్రా మహిళలకు శుభవార్త.. షూరిటీ లేకుండానే రూ.10 లక్షల రుణం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

అమరావతి, మే 25, (నేటి తెలుగు పత్రిక): డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. దీన్‌దయాల్ అంత్యోదయ యోజన పథకం కింద సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల (MSME) యూనిట్ల స్థాపన కోసం గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు ఎలాంటి షూరిటీ లేకుండా రుణం అందించనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు.ఈ పథకం ఫుడ్ ప్రాసెసింగ్, చేపల ప్రాసెసింగ్, పుట్టగొడుగుల ఉత్పత్తి, తేనె తయారీ, నర్సరీల ఏర్పాటు, సోలార్ డ్రయ్యర్లు, మునగ సాగు వంటి రంగాలకు వర్తిస్తుందని తెలిపారు. గ్రామీణ మహిళలు స్వయం ఉపాధి దిశగా ముందుకు వెళ్లేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.రుణాల కోసం అవసరమైన DPR (డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) తయారీతో పాటు దరఖాస్తు ప్రక్రియలో సెర్ప్, వెలుగు అధికారులు పూర్తి సహకారం అందిస్తారని మంత్రి తెలిపారు. మహిళా సంఘాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్