మే 25, (నేటి తెలుగు పత్రిక): తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ఏపీలో పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పోలవరం, ఉభయ గోదావరి జిల్లాల్లో 45 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.అటు తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో 44 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని అంచనా వేశారు.తీవ్ర ఎండల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు. మధ్యాహ్న సమయంలో జాగ్రత్తలు పాటించాలని, ఎక్కువగా నీరు తాగాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగ.. పలుచోట్ల 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు
