బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

బీఆర్‌ఎస్ వస్తే హైదరాబాద్‌కు 24 గంటల తాగునీరు: కేటీఆర్

బీఆర్‌ఎస్ వస్తే హైదరాబాద్‌కు 24 గంటల తాగునీరు: కేటీఆర్

మే 25, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో ప్రతి ఇంటికి 24 గంటల పాటు తాగునీరు అందించే వ్యవస్థను బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో జరిగిన బీఆర్‌ఎస్ జనరల్ బాడీ సమావేశంలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.తెలంగాణకు నిరంతర విద్యుత్ సరఫరా అందించినట్లుగానే, హైదరాబాద్ నగరానికి నిరంతర తాగునీటి సరఫరా కూడా అందించేది కేసీఆరేనని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, నగర ప్రజలు ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం వారి పాలనపై ఉన్న అవగాహనకే నిదర్శనమన్నారు.గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఫ్లైఓవర్లు, ఆసుపత్రులు, భవనాలను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తమవిగా ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే పార్టీ కార్యకర్తలకు మరింత ప్రాధాన్యం, గౌరవం కల్పిస్తామని హామీ ఇచ్చారు.అలాగే కాంగ్రెస్, బీజేపీ పార్టీల దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రతి ఓటును కాపాడేలా కృషి చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి