బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి.. గవర్నర్‌ను కలిసిన కవిత

భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి.. గవర్నర్‌ను కలిసిన కవిత

మే 27, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్‌తో కలిసి వెలుగుమట్ల, ట్రిపుల్ ఆర్, పరిగి బాధితులతో కలిసి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిశారు. భూసేకరణ, ఇళ్ల కూల్చివేతలు, ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్పుల వల్ల బాధితులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, మహిళల ఇళ్లను కూల్చి వారి మనశ్శాంతిని దెబ్బతీస్తోందని ఆరోపించారు. వెలుగుమట్ల, పరిగి, ట్రిపుల్ ఆర్ బాధితులకు న్యాయం చేయాలని గవర్నర్‌కు వినతిపత్రం అందించామని తెలిపారు. సమస్యలపై ప్రభుత్వం నుంచి నివేదిక తెప్పించి న్యాయం చేసే ప్రయత్నం చేస్తానని గవర్నర్ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కవిత విమర్శించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి