Breaking News

లక్షద్వీప్‌కు చేరిన నైరుతి రుతుపవనాలు

మే 28, (నేటి తెలుగు పత్రిక): భారత వాతావరణ శాఖ నైరుతి రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదులుతున్నాయని వెల్లడించింది. ప్రస్తుతం ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్‌ ప్రాంతాలతో పాటు బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించినట్లు తెలిపింది.వాతావరణ శాఖ ముందస్తు అంచనాల ప్రకారం ఈ నెల 26 నాటికే Kerala తీరానికి రుతుపవనాలు చేరాల్సి ఉండగా, స్వల్ప ఆలస్యం జరుగుతున్నట్లు సమాచారం. సాధారణంగా జూన్ 1న కేరళ తీరాన్ని తాకే నైరుతి రుతుపవనాలు, అనంతరం వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు విస్తరిస్తాయి.ఈసారి కూడా రుతుపవనాల పురోగతిని వాతావరణ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది. రైతులు, ప్రజలు తాజా వాతావరణ హెచ్చరికలను గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.

పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం: కూటమి సర్కారుపై జగన్ తీవ్ర విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *