బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

అమరావతికి నిఫ్ట్‌ కోసం సీఎం విజ్ఞప్తి.. కేంద్రం సానుకూల స్పందన

అమరావతికి నిఫ్ట్‌ కోసం సీఎం విజ్ఞప్తి.. కేంద్రం సానుకూల స్పందన

మే 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జాతీయ ఫ్యాషన్ సాంకేతిక విద్యా సంస్థ (నిఫ్ట్‌) ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌ను కోరారు. సచివాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో వస్త్ర, ఫ్యాషన్ రంగాల అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను ఆయన ప్రస్తావించారు. కుప్పం ప్రాంతాన్ని వస్త్ర పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ‘పీఎం మిత్ర’ పార్కును ఏర్పాటు చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. దీనివల్ల పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు.అలాగే రాష్ట్రంలో ఉద్యాన పంటల ద్వారా ఉత్పత్తి అవుతున్న సహజ ఫైబర్‌కు ప్రోత్సాహం అందించి, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి కేంద్రం సహకరించాలని కోరారు. రైతులకు అదనపు ఆదాయం కల్పించేలా ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని విన్నవించారు.సీఎం ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అమరావతిలో నిఫ్ట్‌ ఏర్పాటు, కుప్పంలో పీఎం మిత్ర పార్కు స్థాపన, ఫైబర్ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి అంశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్