Breaking News

ప్రజల సమస్యలు తీర్చడంలో కూటమి ప్రభుత్వం ముందంజ.!

విజయవాడ. మే 30 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఏపీ లో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తుందని మాజీ కేంద్రమంత్రి వర్యులు విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారా యణ (సుజనా చౌదరి) అన్నారు. ఈ సందర్భంగా విజయవాడభవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో శనివారం ఆయన ప్రజా దర్బార్ ను నిర్వహించారు. కూటమినేతలతో కలిసి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ మేరకు ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడు తూ ప్రజా సమస్యల పరి ష్కారం దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసు కుంటుందన్నారు. రెండేళ్ల పాలనలో పశ్చిమాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామన్నారు. సుజనా ఫౌండేషన్ ద్వారా, సీడ్స్, క్రిస్ప్ స్వ చ్ఛంద సంస్థల సహకారం తో పశ్చిమ లో అంగన్వా డీలు, ప్రభుత్వ పాఠశాల లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపి స్తున్నామన్నారు. ప్రాథమి క దశలోనే వ్యాధులను గుర్తించడం ద్వారా పేదల కు ఆరోగ్య కరమైన జీవన శైలి సులభ తరం అవు తుందన్నారు. ప్రతి ఒక్క రూ సుజనా ఫౌండేషన్ ఉచిత మెడి కల్ క్యాంపు లను సద్వినియోగం చేసు కోవాలని సూచించారు. పశ్చిమ అభివృద్ధికి పార్టీ లకతీతంగా ప్రజలందరూ కలిసి రావాలని మరింత అభిద్ధికై తగు సలహాలు సూచనలు ఇవ్వాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి కోరారు.ఈ కార్యక్రమంలో నూర్ భాషా దూదేకుల కార్పొరే షన్ చైర్మన్ నాగుల్ మీరా, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మ సాని సుబ్బారావు, దుర్గమ్మ గుడి మాజీ చైర్మన్ పైలా సోమి నాయుడు, టీడీపీ సీని యర్ నాయకులు కోగంటి రామారావు, మాజీ కార్పొ రేటర్లు బుల్లా విజయ్ కుమార్, యేదుపాటి రామయ్య, మహాదేవు అప్పాజీరావు, అత్తలూరి ఆదిలక్ష్మీ పెదబాబు, మైలవరపు దుర్గారావు, మరుపిళ్ళ రాజేష్, గుడి వాడ నరేంద్ర రాఘవ, పత్తి నాగేశ్వరరావు, అలుగుండ్ల సుబ్బారెడ్డి, అబ్దుల్ ఖాదర్, పీ వీ చిన సుబ్బయ్య, జనసేన నేతలు తిరుపతి సురేష్, తిరుపతి అనూష, బొల్లేపల్లి కోటేశ్వరరావు, ఏలూరు సాయి శరత్, బీజేపీ నేతలు నున్న కృష్ణ, పోతిన భేసు కంటేశ్వరుడు, పచ్చి పులుసు వెంకట శివప్ర సాద్, దుర్బేసుల హుస్సే న్, పిట్టల గోవిందు పైలా సురేష్, కందుల సుబ్రమ ణ్యేశ్వరరావు, పగడాల కృష్ణ, రుద్రపాటి వెంకటే ష్, పగడాల కృష్ణ, బెన్నా భక్తుల సోమేశ్వర రావు, షేక్ మధు మస్తాన్, మంగళపురి మహేష్, గడ్డీపాటి కిరణ్, ఏ ఈ జాస్మీన్, అమెనిటీస్ సెక్రటరీ గీతిక, నియోజక వర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ సిబ్బంది, తది తరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ టికెట్ ధరల పెంపు లేదు.. ప్రైవేటీకరణ జరగదు: మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

విశాఖ అభివృద్ధికి రూ.1,500 కోట్ల ప్రాజెక్టులు.. కేంద్ర నిధులతో కొత్త ఊపు: ఎంపీ శ్రీభరత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *