బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

బీఆర్ఎస్ రాజకీయ నాటకంలో బాల్క సుమన్ బలయ్యారు: అద్దంకి దయాకర్

బీఆర్ఎస్ రాజకీయ నాటకంలో బాల్క సుమన్ బలయ్యారు: అద్దంకి దయాకర్

హైదరాబాద్, మే 30, (నేటి తెలుగు పత్రిక): బీఆర్ఎస్ పార్టీ రాజకీయ డ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బలయ్యారని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ అగ్రనాయకత్వం అనుసరిస్తున్న రాజకీయ విధానాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.బాల్క సుమన్‌తో వివాదాస్పద వ్యాఖ్యలు చేయించింది ఎవరో బయటపడాల్సిన అవసరం ఉందని దయాకర్ అన్నారు. రైల్వే పట్టాలు కోయాలని, దాడులకు పాల్పడాలని పిలుపునివ్వడం బీఆర్ఎస్ రాజకీయ సంస్కృతికి నిదర్శనమని ఆరోపించారు. ఈ విధమైన రాజకీయాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమని, అదే ధోరణిని కేటీఆర్‌కు, అనంతరం బాల్క సుమన్‌కు బోధించారని విమర్శించారు.కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన లోపాలు, ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంపై ప్రశ్నిస్తే బీఆర్ఎస్ నేతలు ‘జై తెలంగాణ’ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని దయాకర్ ఆరోపించారు. తప్పులు చేసి వాటిని సమర్థించుకోవడం బీఆర్ఎస్ నాయకులకు అలవాటుగా మారిందన్నారు.ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగ సంఘాలు, రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడమే బీఆర్ఎస్ లక్ష్యమని ఆయన విమర్శించారు. అధికారం కోసం ఎలాంటి చర్యలకైనా దిగజారేందుకు ఆ పార్టీ సిద్ధంగా ఉంటుందని ఆరోపించారు.బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యల వెనుక ఎవరి పాత్ర ఉందో పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేసి నిజాలు వెలుగులోకి తీసుకురావాలని అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి