బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం: రామచంద్రరావు

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం: రామచంద్రరావు

జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రామచంద్రరావు విమర్శించారు. రైతుల నుంచి చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ హామీని అమలు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపించారు.

ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రోడ్లపై ధాన్యం కుప్పలుగా పేరుకుపోయినా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రైస్ మిల్లర్లతో కుమ్మక్కై రైతుల ప్రయోజనాలను విస్మరిస్తోందని ఆరోపించారు.

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు సరికావని, రాష్ట్రాలు కొనుగోలు చేసిన ధాన్యానికే కేంద్రం రీయింబర్స్‌మెంట్ ఇస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పండిన పంట వివరాలను కేంద్రానికి సకాలంలో అందించకపోవడం కూడా సమస్యలకు కారణమైందని పేర్కొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి వారికి న్యాయం చేయాలని ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేశారు. బీజేపీ చేపట్టిన ఆందోళనల కారణంగానే కొనుగోలు కేంద్రాలకు లారీలను పంపే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు.

అదేవిధంగా, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి, రైతు సంక్షేమం అంశాలపై పార్టీ పోరాటం కొనసాగుతుందని రామచంద్రరావు స్పష్టం చేశారు.