బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

వర్షాకాల సన్నద్ధతపై సీఎం సమీక్ష.. రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశం

వర్షాకాల సన్నద్ధతపై సీఎం సమీక్ష.. రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశం

జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): వర్షాకాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నైరుతి రుతుపవనాలు, వర్షపాతం అంచనాలు, ఎల్‌నినో ప్రభావంపై వాతావరణ శాఖ అధికారులు నివేదిక సమర్పించారు.

వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులకు ముందస్తు అవగాహన కల్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. తక్కువ నీటితో సాగు చేయగల పంటలు, పంటల మార్పిడి, పంటల వైవిధ్యంపై రైతులకు విస్తృతంగా సూచనలు అందించాలని చెప్పారు.

అలాగే రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్వహణ పనులపై సమీక్ష నిర్వహించిన సీఎం, గేట్ల మరమ్మతులు మరియు ఇతర నిర్వహణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని సూచించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

విపత్తు నిర్వహణ కోసం అందుబాటులో ఉన్న రూ.1,000 కోట్ల నిధులను నిబంధనల ప్రకారం వినియోగించాలని అధికారులకు సూచించారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులు, కూలిపోయిన వంతెనల పునర్నిర్మాణానికి అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించారు.

ప్రకృతి విపత్తుల సమయంలో ప్రాణనష్టం, ఆస్తినష్టం, పశునష్టం సంభవించినప్పుడు అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. సమావేశంలో వ్యవసాయం, నీటిపారుదల, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఆరోగ్యం, హోంశాఖ, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.