Breaking News

Chasing and holding...Anbalens thief

ఆంబులెన్స్ దొంగని ఛేజింగ్ చేసి పట్టుకున్నరు..

ఆంబులెన్స్ దొంగను పట్టుకున్న పోలీసులు

సినీ ఫక్కీలో పోలీసులు దోషిని ఛేజింగ్ చేసి పట్టుకున్నారు.

హయత్‌నగర్‌లో 108 అంబులెన్స్ చోరీ చేసి పారిపోతున్న ఓ దొంగను పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. ఈ ఘటనలో ఒక ఏఎస్‌ఐ తీవ్రంగా గాయపడ్డారు.

హైదరాబాద్‌లో 16 వేల మెడికల్ షాపులు బంద్

హైదరాబాద్ శివార్లలోని హయత్‌నగర్‌లోని ఆసుపత్రి ఎదుట parked ఉన్న అంబులెన్స్‌ను ఓ దొంగ చోరీ చేయడానికి ప్రయత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే అతడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. దొంగ అంబులెన్స్‌ను సైరన్ మోగిస్తూ వేగంగా విజయవాడ వైపుకు పారిపోయాడు.

పోలీసులు చిట్యాల వద్ద అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా, దొంగ దూసుకుపోతూ ఏఎస్‌ జాన్ రెడ్డిని ఢీకొట్టాడు. ఆంబులెన్స్ ఆపకుండా అతడు పారిపోయాడు. తర్వాత కోర్ల పహాడ్‌ టోల్‌గేట్ వద్ద గేటును ఢీకొట్టి వేగంగా దూసుకెళ్లాడు.

సూర్యాపేట పోలీసులు అలెర్ట్ అయి, టేకుమట్ల వద్ద రోడ్డుపై లారీలు అడ్డంగా నిలిపివేశారు. అప్పుడు చివరికి దొంగ పట్టుబడ్డాడు. నిందితుడు పై గతంలో పలు చోరీ కేసులు ఉన్నట్టు గుర్తించారు.

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్

ఏఎస్‌ జాన్ రెడ్డి తీవ్రంగా గాయపడటంతో, చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *