|| Journalists play a vital role in society ||
సమాజంలో పాత్రికేయులది కీలకపాత్ర
APUWJ డైరీ ఆవిష్కరించిన చిత్తూరు కలెక్టర్..!
చిత్తూరు : సమాజంలో పాత్రికేయులది కీలక పాత్ర అని కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. APUWJ డైరీ-2025 లను చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ , జాయింట్ కలెక్టర్ విద్యాధరి లు సోమవారం ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు M. లోక నాథన్, B. మురళీ కృష్ణ, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి అశోక్ కుమార్, ఉపాధ్యక్షుడు శివకుమార్ , కార్యవర్గ సభ్యులు సురేష్ ,జయకర్ , చిత్తూరు ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు పవన్, శివప్రసాద్,కార్యవర్గ సభ్యుడు బాల ,రాజేష్,సీనియర్ పాత్రికేయులు KN. సుభాష్ బాబు, మూర్తి , హేమంత్ కుమార్ ,పాత్రికేయులు జయ కుమార్ , గణేష్ , తదితరులు పాల్గొన్నారు.
అలాగే జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దీనిపై కలెక్టర్ స్పందిస్తూ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా ఉండే జర్నలిస్టుల సేవలు ఎనలేనివని అన్నారు. క్షేత్రస్థాయిలో జర్నలిస్టులకు ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు.
