రేపు, ఎల్లుండి సెలవు
శివరాత్రి సందర్భంగా రేపు తెలుగు రాష్ట్రాల్లోని విద్యా సంస్థలకు సెలవు ఉండనుంది. అలాగే ఎల్లుండి గ్రాడ్యుయేట్, టీచర్ MLC ఎన్నికలు జరగనున్నాయి. దీంతో APలో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లకు ప్రత్యేక హాలిడే ఇవ్వాలని SEC ఆదేశించింది. TGలోని ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోనూ సెలవు ఉంటుంది..