Breaking News

Premonmadi poured petrol on the student and set fire

విద్యార్థినిపై ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించాడు

ఇంటర్ విద్యార్థినిపై ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన

నంద్యాల జిల్లా: డిసెంబర్ 09

నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు బైరెడ్డి నగర్లో దారుణమైన సంఘటన జరిగింది. ఇంటర్ విద్యార్థినిపై ప్రేమ ఒప్పుకోలేదనే కారణంతో ఓ ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం, ఆ యువకుడు తానూ నిప్పంటించుకున్నాడు.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

ఈ ఘటనలో విద్యార్థిని అక్కడికక్కడే మరణించింది. ప్రేమోన్మాది తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలించబడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, బైరెడ్డి నగర్లో నివసించే యువతి కొద్దికాలంగా ఓ యువకుడు ప్రేమతో ఆమెను వేధిస్తున్నాడు. ఆమె ప్రేమను అంగీకరించకపోవడంతో, ఆదివారం రాత్రి ఆమె నిద్రిస్తున్న సమయంలో యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించి, తనను తాను నిప్పంటించుకున్నాడు.

ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Reconstruction of the state is our goal: CM Chandrababu
రాష్ట్ర పునర్నిర్మాణం మా లక్ష్యం: సీఎం చంద్రబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *