మహాశివరాత్రి సందర్భంగా దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వ పట్టు వస్త్రాల సమర్పణ
హైదరాబాద్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలు ప్రముఖ శివాలయాలకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
- శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామివారికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
- జయశంకర్ భూపాలపల్లిలోని కాళేశ్వరముకటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి శ్రీధర్ బాబు పట్టు వస్త్రాలు అందజేయనున్నారు.
- మెదక్ జిల్లా నాగసానిపల్లి ఏడుపాయల వన దుర్గాభవాని దేవస్థానంలో మంత్రి దామోదర రాజ నర్సింహ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
- ములుగు రామలింగేశ్వర స్వామి ఆలయంలో మంత్రి సీతక్క,
- సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు స్వయంభూ శంభులింగేశ్వర ఆలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్,
- నల్గొండ జిల్లా ఛాయా సోమేశ్వర ఆలయంలో మంత్రి కోమటిరెడ్డి,
- పాలకుర్తి సోమేశ్వర దేవస్థానంలో మంత్రి కొండా సురేఖ పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.
మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో, రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూజా కార్యక్రమాలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శివనామస్మరణతో ఆలయాలు భక్తులతో నిండిపోనున్నాయి.