Breaking News

భక్తితోనే మానసిక ప్రశాంతత: మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

కోదాడ ,మార్చి 29(నేటి తెలుగు పత్రిక): భక్తితోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.రెండవ భద్రాద్రిగా ప్రసిద్ధిగాంచిన కోదాడ పట్టణ పరిధిలోని తమ్మరబండపాలెం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో నిర్వహిస్తున్న కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలలో భాగంగా స్వామివారిని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ పురోహితులు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కి వేద మంత్రోచ్ఛరణలతో ఆశీర్వచనాలు అందజేసి, తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వరమ్మ, నరసింహారావు, శ్రీధర్, కృష్ణయ్య, శిరీష యల్లయ్య, చంద్రమోహన్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *