హైదరాబాద్, మార్చి 30, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో విద్వేష ప్రసంగాలు, విద్వేష నేరాల ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కఠిన చట్టం ప్రవేశపెట్టారు. ఈ బిల్లుతో మతం, జాతి, కులం, లింగం, భాష ఆధారంగా ప్రజలను విభజించే ప్రసంగాలను, సోషల్ మీడియా, డిజిటల్ వేదికల ద్వారా వ్యాప్తి చెందే ద్వేషాన్ని అరికట్టడం, నియంత్రించడం లక్ష్యంగా పెట్టారు.చట్టం ప్రకారం, ఏ వ్యక్తి, సమూహం లేదా సంస్థ అయినా ద్వేషాన్ని ప్రేరేపించే ప్రసంగాలు, ప్రచారాలు, ప్రచురణలను నివారించాల్సి ఉంటుంది. సెక్షన్ 2లో గాయం లేదా ద్వేషాన్ని కలిగించే పదాలు, సంకేతాలు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్‌లను పూర్వనిర్వచనం చేసి, ‘పక్షపాత ప్రయోజనాలు’కు సమగ్ర నిర్వచనం ఇచ్చారు.సెక్షన్ 6 ప్రకారం, సేవా సంస్థలకు ఆదేశాలు ఇచ్చి, ద్వేషపూరిత కంటెంట్‌ను తొలగించడం లేదా నిరోధించడం, పునరావృత నేరస్థులపై నివారణ చర్యలు తీసుకోవడం వంటి అధికారాలు కల్పించబడ్డాయి. ఇదే కాకుండా, బెయిల్ అనుమతించని నేరాలుగా ఈ విద్వేష నేరాలను పరిగణించడం, బాధితులకు తగిన పరిహారం అందించడం విధానం కూడా చట్టంలో స్పష్టంగా ఉంది.మంత్రివర్యులు తెలిపారు, “ఈ బిల్లు కేవలం చట్టం మాత్రమే కాదు, బలహీనులకు రక్షణ కవచం. విద్వేషం వ్యాప్తి చేసేవారికి కఠినమైన సందేశం. తెలంగాణలో విద్వేషపూరిత భాష tolerated కాదు. శాంతి, భద్రత, భవిష్యత్ తరాల భద్రత కోసం పార్టీలకు అతీతంగా ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలి.”
