Breaking News

కేసీఆర్‌తోనే నాకు గుర్తింపు: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మార్చి 30, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో మీడియా చిట్‌చాట్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు దుష్ట పాలనకు చెక్ పెట్టి తనను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని ఆయన తెలిపారు.“ప్రజలు కేసీఆర్ కావాలా? నేను కావాలా? అని ఆలోచించి నన్ను సీఎం చేశారు. దుష్ట పాలన నుంచి విముక్తి పొంది ప్రజా పాలనకు మార్గం సుగమం చేశారు” అని రేవంత్ పేర్కొన్నారు.అలాగే, “రావణుడి వల్లే రాముడికి గుర్తింపు వచ్చినట్లే, కేసీఆర్ వల్లే నాకు గుర్తింపు వచ్చింది” అని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండటం వల్లే తన పనులు ప్రజలకు మరింతగా తెలిసాయని తెలిపారు.కేసీఆర్ ప్రస్తుత పరిస్థితిపై కూడా స్పందిస్తూ, ఆయన గృహనిర్బంధంలో ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన రాజకీయంగా యాక్టివ్‌గా లేరని వ్యాఖ్యానించారు.అలాగే పంటల అంశంపై మాట్లాడుతూ, గతంలో వరి వేయొద్దని చెప్పిన కేసీఆర్ సన్నబియ్యం ఇవ్వలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం మాత్రం సన్నబియ్యం అందిస్తున్నదని తెలిపారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *