మే 16, (నేటి తెలుగు పత్రిక): కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించాలని తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. పోక్సో కేసు నేపథ్యంలో బాధిత మైనర్ బాలికకు న్యాయం జరగాలంటే, విచారణ పారదర్శకంగా సాగాలంటే బండి సంజయ్‌ను పదవి నుంచి తప్పించడం అవసరమని ఆమె పేర్కొన్నారు.చట్టంపై ప్రజలకు నమ్మకం కలిగేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కవిత కోరారు. కేసు దర్యాప్తుపై ఎలాంటి ప్రభావం లేకుండా ఉండేందుకు విచారణ పూర్తయ్యే వరకు సంజయ్‌ను పదవి నుంచి తప్పించాలని సూచించారు.
