మే 18, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో గురుకులాలు, ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇకపై ‘డైట్’, ‘కాస్మొటిక్స్’, ‘భవన అద్దె’ నిధులను ప్రతి నెలా విడుదల చేసే విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు.ఈ కొత్త నెలవారీ చెల్లింపుల విధానం ద్వారా హాస్టల్ నిర్వహణ మరింత సక్రమంగా సాగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. తొలి విడతగా రూ.221.24 కోట్ల నిధులను విడుదల చేసినట్లు తెలిపారు.ఈ నిర్ణయంతో విద్యార్థుల భోజనం, అవసరమైన వస్తువులు, వసతి సదుపాయాల నిర్వహణలో ఆలస్యం తగ్గి, కనీస అవసరాలను సకాలంలో అందించే అవకాశం ఏర్పడనుంది.
విద్యార్థులకు ఊరట.. నెలనెలా హాస్టల్ నిధుల విడుదల: భట్టి విక్రమార్క
