బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

యాదగిరిగుట్ట వేద పాఠశాల శంకుస్థాపనకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

యాదగిరిగుట్ట వేద పాఠశాల శంకుస్థాపనకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

మే 18, (నేటి తెలుగు పత్రిక): ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం పరిధిలో ఈ నెల 23న నిర్వహించనున్న వేద పాఠశాల శంకుస్థాపనతో పాటు పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు.దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు యాదగిరిగుట్ట దేవస్థాన అర్చక బృందం, ఉన్నతాధికారులు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సీఎం రేవంత్ రెడ్డికి వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు సమర్పించారు.ఈ కార్యక్రమంలో ఎంపీలు వేమ్ నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, యాదగిరిగుట్ట ఆలయ ఈవో భవాని శంకర్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి