బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

“ఈ జన్మకి చాలు”.. పవన్‌ను కలిసిన తనీష్ భావోద్వేగ పోస్ట్

“ఈ జన్మకి చాలు”.. పవన్‌ను కలిసిన తనీష్ భావోద్వేగ పోస్ట్

మే 18, (నేటి తెలుగు పత్రిక): టాలీవుడ్ నటుడు తనీష్ అల్లాడి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ‘జనసేన సాధక్’ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన, పవన్‌తో ప్రత్యేకంగా భేటీ కావడం రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.ఈ భేటీ అనంతరం తనీష్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. “ఏం కావాలి ఇంతకన్నా.. చాలు ఈ జన్మకి. కట్టే కాలేంత వరకు మీతోనే కళ్యాణ్ సర్” అంటూ భావోద్వేగంగా స్పందించారు.సినీ పరిశ్రమలో 27 ఏళ్లుగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా కలవడం ఇదే తొలిసారని తనీష్ తెలిపారు. “ఆయన్ను చూడగానే కొన్ని క్షణాలు మాటలు రాలేదు. మనం కలిసి పనిచేద్దాం అని పవన్ సర్ చెప్పిన మాట జీవితాంతం గుర్తుండిపోతుంది” అని పేర్కొన్నారు.గత ఏడాది నుంచి తెలంగాణలో జనసేన పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్న తనీష్.. యువతలో పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ నిజాయితీ, ప్రజాసేవా దృక్పథం తనను ఎంతో ప్రభావితం చేసిందని చెప్పారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి