Breaking News

హైదరాబాద్‌లో విదేశీ ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. నిరుద్యోగుల నుంచి లక్షల్లో వసూళ్లు

మే 18, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో మరో విదేశీ ఉద్యోగాల మోసం వెలుగులోకి వచ్చింది. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేసిన కన్సల్టెన్సీ నిర్వాహకులు పరారయ్యారు. ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్‌పేట్‌లో చోటుచేసుకుంది.పోలీసుల వివరాల ప్రకారం.. అర్చన ప్రియ, సోమశేఖర్, రాజేంద్రప్రసాద్ కలిసి “సీడీ దశరథ్ కన్సల్టెన్సీ” పేరుతో సంస్థ నిర్వహిస్తున్నారు. ఈజిప్ట్, ఇజ్రాయెల్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగులను ఆకర్షించారు. ఒక్కో అభ్యర్థి వద్ద నుంచి సుమారు రూ.6 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది.మొత్తం 90 మంది వరకు ఈ మోసానికి గురైనట్లు సమాచారం. కొంతమందిని ఈజిప్ట్ వరకు తీసుకెళ్లిన నిర్వాహకులు.. అక్కడికి చేరుకున్న తర్వాత ఫోన్‌లు స్విచ్ ఆఫ్ చేసి కనిపించకుండా పోయారు. దీంతో బాధితులు సొంత ఖర్చులతో తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు.హఫీజ్‌పేట్‌లోని కన్సల్టెన్సీ కార్యాలయానికి వెళ్లి చూడగా ఆఫీస్ మూసివేసి ఉండటంతో తాము మోసపోయినట్లు గుర్తించారు. వెంటనే బాధితులు మియాపూర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న కన్సల్టెన్సీ నిర్వాహకుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.ఈ ఘటన నేపథ్యంలో విదేశీ ఉద్యోగాల పేరుతో మోసాలు పెరుగుతున్నాయని, నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అధికారిక అనుమతులు, రిజిస్ట్రేషన్ వివరాలు పూర్తిగా ధృవీకరించుకున్న తర్వాతే కన్సల్టెన్సీలను నమ్మాలని హెచ్చరిస్తున్నారు.

టీఆర్ఎస్ జెండా గద్దెలకు ఒకే నమూనా.. నెలరోజుల జెండా ఉత్సవాలకు కవిత పిలుపు

బండి సంజయ్‌పై దుష్ప్రచారం జరుగుతోంది : రామచందర్ రావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *