బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

“ఒక్క ఆరోపణనైనా పూర్తిగా నిరూపించారా?”.. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఫైర్

“ఒక్క ఆరోపణనైనా పూర్తిగా నిరూపించారా?”.. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఫైర్

మే 18, (నేటి తెలుగు పత్రిక): ఏపీ రాజకీయాల్లో మరోసారి ఆరోపణలు, ప్రతిఆరోపణలు వేడెక్కాయి. వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మంత్రి టీజీ భరత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.మీడియాతో మాట్లాడిన బైరెడ్డి.. తనపై విమర్శలు చేసే వారికి ప్రత్యేక ప్రోత్సాహాలు ఇస్తున్నారని టీజీ భరత్‌పై విమర్శలు గుప్పించారు. “నాకు టికెట్ రాలేదని మాట్లాడేవారికి, నేను ఎమ్మెల్యే కావాలనే కోరిక నాకంటే ఎక్కువగా ఉన్నట్టుంది” అంటూ వ్యంగ్యంగా స్పందించారు.ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సతీష్ కుటుంబానికి ఫార్మా కంపెనీ నుంచి డబ్బులు వెళ్లాయని తాను ఆధారాలతో బయటపెడతానని బైరెడ్డి తెలిపారు. అయితే నిజాలు బయటకు రాకుండా రాజకీయ ఒత్తిళ్లు తెస్తున్నారని ఆరోపించారు.“ఆడుదాం ఆంధ్రా” కార్యక్రమంలో రూ.600 కోట్ల అవినీతి జరిగిందని గతంలో తనపై ఆరోపణలు చేశారని గుర్తుచేసిన ఆయన.. ఇప్పుడు విజిలెన్స్ నివేదికలో రూ.40 కోట్ల అక్రమాలే ఉన్నాయని చెప్పారని అన్నారు. “మరి మిగిలిన రూ.560 కోట్ల ఆరోపణలు ఏమయ్యాయి?” అని ప్రశ్నించారు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పుడు ప్రచారాలు చేయడం సులభమని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాస్తవాలు బయటపడతాయని బైరెడ్డి వ్యాఖ్యానించారు. వ్యక్తిగత విమర్శలకు బదులుగా ప్రజా సమస్యలపై చర్చించాలని రాజకీయ పార్టీలకు సూచించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్