బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

డ్రోన్ సాంకేతికతతో వ్యవసాయానికి కొత్త దిశ: మంత్రి తుమ్మల

డ్రోన్ సాంకేతికతతో వ్యవసాయానికి కొత్త దిశ: మంత్రి తుమ్మల

మే 23, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విస్తృతంగా పర్యటించారు. విశ్వవిద్యాలయంలోని పలు పరిశోధనా విభాగాలు, ప్రయోగశాలలను సందర్శించిన మంత్రి ఆధునిక వ్యవసాయ సాంకేతికతపై అధికారులకు కీలక సూచనలు చేశారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. డ్రోన్ సాంకేతికత ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చన్నారు. డ్రోన్ల వినియోగంతో సాగు ఖర్చులు తగ్గడంతో పాటు పురుగుమందుల పిచికారీ వంటి పనులు వేగంగా పూర్తవుతాయని తెలిపారు.డిజిటల్ వ్యవసాయంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించిన మంత్రి.. ప్రయోగశాలల్లో జరిగే పరిశోధనలు కేవలం అధ్యయనాలకే పరిమితం కాకుండా రైతులకు ఉపయోగపడేలా క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని అన్నారు.సంప్రదాయ వ్యవసాయానికి ఆధునిక సాంకేతిక పరికరాలను అనుసంధానం చేసినప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని, రైతు సంక్షేమం సాధ్యమవుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి