బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

బీఆర్ఎస్‌లో హరీశ్‌రావు భవిష్యత్తు ఆయనకే తెలియదు.. మంత్రి పొంగులేటి సెటైర్లు

బీఆర్ఎస్‌లో హరీశ్‌రావు భవిష్యత్తు ఆయనకే తెలియదు.. మంత్రి పొంగులేటి సెటైర్లు

మే 23, (నేటి తెలుగు పత్రిక): మాజీ మంత్రి హరీశ్‌రావుపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా నుంచి ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును ఆపేస్తామంటూ హరీశ్‌రావు ఎలా మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్‌లో హరీశ్‌రావు రాజకీయ భవిష్యత్తు ఏమిటో ఆయనకే స్పష్టత లేదంటూ సెటైర్లు వేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తు కోసం కొత్త నగరాన్ని నిర్మిస్తోందని మంత్రి పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ కుటుంబం ఫాంహౌస్‌ల నిర్మాణంపై దృష్టి పెట్టిందని ఆరోపించారు. ఫ్యూచర్ సిటీ భూములపై అమెరికాలో ఎవరితోనైనా ఒప్పందాలు జరిగాయా అని ప్రశ్నించారు.మూసీ ప్రక్షాళన, లగచర్ల పరిశ్రమల అభివృద్ధి వంటి అంశాలకు బీఆర్ఎస్ నేతలు అడ్డుపడ్డారని ఆయన విమర్శించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నాలను కుట్రలతో అడ్డుకున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.దేశం గర్వించే విధంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని మంత్రి స్పష్టం చేశారు. బీఆర్ఎస్‌కు భవిష్యత్తు లేదని, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుకు తిరుగులేదని ఆయన వ్యాఖ్యానించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి