Breaking News

ఇంటర్ ఫస్టియర్ సిలబస్‌లో కీలక మార్పులు

మే 27, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ ఫస్టియర్ సిలబస్‌లో పలు కీలక మార్పులు చేసింది. వివిధ సబ్జెక్టుల్లో పునరావృతమవుతున్న పాఠాలను తొలగించడంతో పాటు, విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా కొత్త అంశాలను చేర్చింది.పాఠ్యపుస్తకాలలో వీడియో, ఆడియో రూపంలో లెసన్స్ వినేందుకు QR కోడ్‌లను పొందుపరిచారు. తెలుగు సబ్జెక్టులో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పాఠ్యాంశాలను చేర్చగా, గణితంలో ‘Do You Know’ బాక్సులు, ప్రముఖ శాస్త్రవేత్తల పరిచయాలను జోడించారు. ఫిజిక్స్‌లో ‘AI ఫిజిక్స్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్’ అనే కొత్త అంశాన్ని ప్రవేశపెట్టారు. అలాగే సైన్స్ సబ్జెక్టులను NCERT సిలబస్‌కు అనుగుణంగా సవరించినట్లు అధికారులు తెలిపారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *