Breaking News

ఉద్యోగులకు బిహార్ సర్కార్ కొత్త రూల్.. మూడు నెలలకు ఓ టూర్ తప్పనిసరి

మే 27, (నేటి తెలుగు పత్రిక): బిహార్ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి మూడు నెలలకు ఒకసారి రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను తప్పనిసరిగా సందర్శించాలని ఆదేశాలు జారీ చేసింది.ఉద్యోగులు కనీసం మూడు పర్యాటక ప్రాంతాలను సందర్శించి, అక్కడ ఒక రాత్రి బస చేయాలని ప్రభుత్వం సూచించింది. ట్రిప్ అనంతరం ఫొటోలు, ఫీడ్‌బ్యాక్‌తో కూడిన నివేదిక సమర్పించాలని పేర్కొంది. ఈ ప్రయాణ సమయాన్ని అధికారిక విధులుగానే పరిగణిస్తామని బిహార్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర పర్యాటక రంగానికి ఊతం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ

ఒమన్ ఒప్పందంతో ఇంధన సరఫరాకు భరోసా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *