Breaking News

రైతులకు కొత్త దిశ.. ‘ఫార్మ్ టు హోమ్’ విధానంపై సీఎం చంద్రబాబు ఫోకస్

మే 27, (నేటి తెలుగు పత్రిక): చంద్రబాబు రైతుల పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారుల ఇళ్లకు చేరేలా ‘ఫార్మ్ టు హోమ్’ విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన కీలక సూచనలు చేశారు.ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ప్రభావంతో ఎరువుల కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రకృతి సేద్యాన్ని మరింత ప్రోత్సహించాలని సీఎం పేర్కొన్నారు. అలాగే ‘పూర్వోదయ’ పథకం కింద రూ.40 వేల కోట్లతో రాయలసీమను ఉద్యానవన హబ్‌గా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.ఇక జూలై నెలలో మదనపల్లెలో ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’కు శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. రైతుల ఆదాయం పెంపు, వ్యవసాయంలో ఆధునిక విధానాల అమలే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం: కూటమి సర్కారుపై జగన్ తీవ్ర విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *