Breaking News

నీట్ పేపర్ లీక్‌లో ముగ్గురు ‘మనీషాలు’ అరెస్ట్

మే 27, (నేటి తెలుగు పత్రిక): నీట్ పేపర్ లీక్‌ Case కేసులో ముగ్గురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురి పేర్లలోనూ ‘మనీషా’ అనే పేరు ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. డబ్బుల కోసం లక్షలాది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.అరెస్ట్ అయిన వారిలో మనీషా వాఘ్మారే బ్యూటీషియన్‌గా పనిచేస్తుండగా, మనీషా మంధారే పుణేలోని మోడరన్ జూనియర్ కాలేజీలో టీచర్‌గా విధులు నిర్వహిస్తోంది. మరో నిందితురాలు మనీషా హవల్దార్ పుణేలోని సేథ్ హీరాలాల్ కాలేజీ ప్రిన్సిపల్‌గా ఉండటంతో పాటు NTA ప్యానెలిస్ట్‌గా కూడా పనిచేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయని దర్యాప్తు సంస్థలు తెలిపాయి.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ

ఒమన్ ఒప్పందంతో ఇంధన సరఫరాకు భరోసా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *