Breaking News

డిజిటల్ చెల్లింపులతో జాగ్రత్త.. వ్యాపారులకు సీపీ సజ్జనార్ హెచ్చరిక

మే 27, (నేటి తెలుగు పత్రిక): వీసీ సజ్జనార్ బక్రీద్ పండుగ నేపథ్యంలో డిజిటల్ చెల్లింపుల విషయంలో వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. జీ పే, ఫోన్ పే వంటి యాప్‌ల ద్వారా నకిలీ చెల్లింపులు చూపిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చాయని తెలిపారు.కాంచన్‌బాగ్‌లో కొందరు వ్యక్తులు రూ.5 వేల చెల్లింపు చేసినట్లు నకిలీ యాప్ స్క్రీన్ చూపించి రూ.68 వేల విలువైన పశువులతో పరారయ్యారని చెప్పారు. అలాగే రాజేంద్రనగర్‌లో రూ.48 వేల విలువైన మేకలను నకిలీ పేమెంట్ యాప్‌తో కొనుగోలు చేసి వ్యాపారిని మోసం చేసిన ఘటన నమోదైందన్నారు.మేకలు, గొర్రెల విక్రేతలు డబ్బు ఖాతాలో జమ అయినట్లు నిర్ధారించుకున్న తర్వాతే పశువులను అప్పగించాలని సీపీ సూచించారు. ఎలాంటి అనుమానాస్పద ఘటనలు ఎదురైనా వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *