మే 27, (నేటి తెలుగు పత్రిక): రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అకాల వర్షాలు, బలమైన ఈదురుగాలుల నేపథ్యంలో అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో తెలంగాణ ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది.ప్రత్యేకంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అదనపు ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, ఇప్పటికే కొనుగోళ్లు పూర్తైన కేంద్రాల నుంచి అవసరమైన ప్రాంతాలకు వాటిని తరలించాలని ఆదేశించారు.భారీ గాలులు, వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో అధికారులు వెంటనే స్పందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
