Breaking News

కడపలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, నిందితుడి కోసం గాలింపు

మే 27, (నేటి తెలుగు పత్రిక): కడప జిల్లాలోని దువ్వూరు మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర అస్వస్థతతో ఇంటికి చేరుకున్న బాలికను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.పోలీసుల వివరాల ప్రకారం, ఈశ్వర్ అనే యువకుడు బాలికను మాయమాటలతో ఖాజీపేటలోని ఓ లాడ్జికి తీసుకెళ్లి దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. వైద్య పరీక్షల్లో బాలికపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారణ కావడంతో కేసు నమోదు చేశారు.ఈ ఘటనపై దువ్వూరు పోలీసులు పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లాడ్జి నిర్వాహకులపైనా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం: కూటమి సర్కారుపై జగన్ తీవ్ర విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *