Breaking News

పంచ్ ప్రభాకర్‌పై చర్యలు తీసుకోవాలి: టీజీ వెంకటేశ్

మే 27, (నేటి తెలుగు పత్రిక): పంచ్ ప్రభాకర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఆర్యవైశ్య మహాసభ చైర్మన్ టీజీ వెంకటేశ్ డిమాండ్ చేశారు. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన, ఆర్యవైశ్య సమాజంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.రాజకీయాల్లో విమర్శలు సహజమేనని, అయితే ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం సరైంది కాదని టీజీ వెంకటేశ్ అన్నారు. తాను రాయలసీమ నాయకుల గురించి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి, మొత్తం కమ్యూనిటీని ప్రస్తావించినట్లు ప్రచారం చేయడం దురుద్దేశపూర్వకమని మండిపడ్డారు.పంచ్ ప్రభాకర్ వ్యాఖ్యలకు నిరసనగా జిల్లాల వారీగా ఆందోళనలు చేపడతామని తెలిపారు. ఇండియాకు వస్తే ఆర్యవైశ్య సమాజం తీవ్రంగా స్పందిస్తుందని కూడా హెచ్చరించారు.

పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం: కూటమి సర్కారుపై జగన్ తీవ్ర విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *