Breaking News

విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో ఎన్‌ఐఏ ఎంట్రీ.. దర్యాప్తు ముమ్మరం

మే 27, (నేటి తెలుగు పత్రిక): విజయవాడలో వెలుగుచూసిన టెర్రర్ లింక్స్ కేసు కీలక మలుపు తిరిగింది. జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలు బయటపడుతున్న నేపథ్యంలో ఈ కేసును National Investigation Agencyకు అప్పగించాలని పోలీసులు నిర్ణయించారు.ఇప్పటివరకు ఈ కేసులో విజయవాడకు చెందిన ముగ్గురితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మరో 12 మందిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. విచారణలో కీలక ఆధారాలు లభించడంతో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు ఎన్‌ఐఏ అధికారులకు లేఖ రాసినట్లు వెల్లడైంది.ఇప్పటికే విశాఖపట్నం ఎన్‌ఐఏ విభాగం కేసు నమోదు చేసినట్లు సమాచారం. మరో రెండు రోజుల్లో కేసును పూర్తిగా టేకోవర్ చేసి సంబంధిత కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనున్నారు. అనంతరం నిందితుల కాల్ డేటా, ఆన్‌లైన్ కమ్యూనికేషన్, ఆర్థిక లావాదేవీలు, ఇతర రాష్ట్రాలతో సంబంధాలపై లోతైన దర్యాప్తు చేపట్టనున్నారు.ఈ కేసులో మరింత విస్తృత నెట్‌వర్క్ ఉన్న అవకాశాలపై కూడా అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.

పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం: కూటమి సర్కారుపై జగన్ తీవ్ర విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *