Breaking News

మహానాడులో జగన్‌పై లోకేశ్ విమర్శలు

మే 27, (నేటి తెలుగు పత్రిక): టీడీపీ మహానాడు వేదికగా మంత్రి నారా లోకేశ్ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. డీఎస్సీ నియామకాలపై వైసీపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. పదో తరగతి పేపర్ లీక్ చరిత్ర జగన్‌దైతే, స్టాన్‌ఫర్డ్‌లో చదివింది తానేనని సెటైర్లు వేశారు.టీచర్లను తమ ప్రభుత్వం సింగపూర్‌కు శిక్షణ కోసం పంపిందని, గత వైసీపీ పాలనలో మాత్రం మద్యం షాపుల వద్ద విధులు చేయించారని విమర్శించారు. పార్టీ బలోపేతం కోసం గ్రామస్థాయి నుంచి పార్లమెంటరీ స్థాయి వరకు సంస్కరణలు తీసుకువచ్చామని తెలిపారు.టీడీపీలో సాధారణ కార్యకర్తలకు కూడా ప్రాధాన్యం కల్పిస్తున్నామని, మహిళా నేతలు, యువ నాయకులను కీలక పదవుల్లోకి తీసుకొస్తున్నామని లోకేశ్ పేర్కొన్నారు.

పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం: కూటమి సర్కారుపై జగన్ తీవ్ర విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *