Breaking News

పుట్టావారిపాలెంలో ఘనంగా మహానాడు–2026 నిర్వహణ: మంత్రి గొట్టిపాటి రవికుమార్

మే 27, (నేటి తెలుగు పత్రిక): తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహానాడు–2026 వేడుకలు మంగళగిరిలో ప్రారంభమైన సందర్భంగా సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెంలోని పీవీఆర్ రెసిడెన్స్‌లో హైబ్రిడ్ విధానంలో మహానాడు కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో పార్టీ జెండాను ఆవిష్కరించి, టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నిర్వహించిన మహానాడు ప్రత్యక్ష ప్రసారాన్ని నాయకులు, కార్యకర్తలతో కలిసి వీక్షించారు. మహిళా సాధికారత ప్రధాన అంశంగా జరుగుతున్న ఈ మహానాడులో రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, యువతకు ఉద్యోగ అవకాశాలు, భవిష్యత్ కార్యాచరణపై కీలక తీర్మానాలు ఆమోదిస్తున్నట్లు తెలిపారు.అద్దంకి నియోజకవర్గంలోని పలు క్లస్టర్లలో హైబ్రిడ్ విధానంలో మహానాడు విజయవంతంగా నిర్వహిస్తున్న కార్యకర్తలు, నాయకులకు అభినందనలు తెలిపారు.

పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం: కూటమి సర్కారుపై జగన్ తీవ్ర విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *