Breaking News

ఆరెంజ్ అలర్ట్ నేపథ్యంలో అప్రమత్తమైన రేవంత్.. ధాన్యం రక్షణకు ప్రత్యేక చర్యలు

మే 27, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.కల్లాల్లో నిల్వ ఉన్న ధాన్యం వర్షానికి తడవకుండా అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇప్పటికే కొనుగోళ్లు పూర్తైన కేంద్రాల నుంచి టార్పాలిన్లను ఇతర ప్రాంతాలకు తరలించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారులు వెంటనే స్పందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *